Latest NewsWest Godavari
రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కృషి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నారని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మంగళవారం బయ్యనగూడెం, సరిపల్లి గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా 2.50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేశారు. సరిపల్లిలో పిఎసిఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్ పర్సన్ ఎం.రామకృష్ణ ఆధ్వర్యంలో 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం సిసి రోడ్లు, నాడు-నేడు సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్ క్లినిక్‌లకు భూమిపూజ చేశారు. బయ్యన గూడెంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొరోడ్లను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజున్నారు.