Andhra PradeshKurnoolLatest NewsPoliticalTelangana
రాష్ట్రానికి మళ్లీ జగనే ముఖ్యమంత్రి
కర్నూలు: రాష్ట్రానికి మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థుల ప్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ…”జగన్ అప్పులు తెచ్చి మరీ రాష్ట్రానికి అన్నీ చేస్తున్నారు. కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
మనది పేద దేశం.. ఎవరినీ ఏమీ చేయలేరు. కర్నూలు సర్వజన వైద్యశాలకు వైద్యులు రాకపోవటం పెద్ద సమస్య కాదు. వైద్యులకు మనం రూ.2లక్షల జీతం ఇస్తుంటే.. బయట రూ.5లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వంలో మంచి పనులు చాలా చేస్తున్నప్పుడు చెడు పనుల గురించి మాట్లడకూడదు” అని వీసీ వ్యాఖ్యానించారు.