రాష్ట్రవ్యాప్తంగా 17.91 లక్షల కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్

రాష్ట్రవ్యాప్తంగా 17.91 లక్షల కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్
29 వేల 706 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం పంపిణీ గుడివాడ , ఫిబ్రవరి 13 : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి , రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) లు ఈ నెల 1 వ తేదీ నుండి ప్రారంభించిన రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల 91 వేల 496 బియ్యం కార్డుదారులకు ఇంటి వద్దకే రేషనను అందజేశారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకే ఈ కార్యక్రమం పరిమితమైంది . దీంతో 9,260 మొబైల్ వాహనాల్లో కేవలం 2,068 వాహనాల ద్వారా మాత్రమే కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు . ఇప్పటి వరకు బియ్యం కార్డుదారులకు 29,706 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 1,110 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశారు . శనివారం ఒక్క రోజే అనంతపురం జిల్లాలో 5,857 బియ్యం కార్డులకు , చిత్తూరు జిల్లాలో 3,287 కార్డులకు , తూర్పుగోదావరి జిల్లాలో 6 , 134 కార్డులకు , గుంటూరు జిల్లాలో 8,469 కార్డులకు , కడప జిల్లాలో 5,626 కార్డులకు , కృష్ణాజిల్లాలో 9,370 కార్డులకు , కర్నూలు జిల్లాలో 6,008 కార్డులకు , నెల్లూరు జిల్లాలో 4,660 కార్డులకు , ప్రకాశం జిల్లాలో 3,038 కార్డులకు , శ్రీకాకుళం జిల్లాలో 1,829 కార్డులకు , విశాఖపట్నం జిల్లాలో 9,045 కార్డులకు , విజయనగరం జిల్లాలో 2 , 626 కార్డులకు , పశ్చిమగోదావరి జిల్లాలో 3,993 కార్డులకు నిత్యావసరాలను అందజేశారు . ఇదిలా ఉండగా డోర్ డెలివరీ విధానంలో కూడా పోర్టబులిటీని అమలు చేస్తున్నారు . దీనిలో భాగంగా ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 2,920 కార్డులకు , చిత్తూరు జిల్లాలో 2,310 కార్డులకు , తూర్పుగోదావరి జిల్లాలో 894 కార్డులకు , గుంటూరు జిల్లాలో 3,627 కార్డులకు , కడప జిల్లాలో 2,454 కార్డులకు , కృష్ణా జిల్లాలో 5,583 కార్డులకు , కర్నూలు జిల్లాలో 3,344 కార్డులకు , నెల్లూరు జిల్లాలో 3,209 కార్డులకు , ప్రకాశం జిల్లాలో 1,515 కార్డులకు , శ్రీకాకుళం జిల్లాలో 482 కార్డులకు , విశాఖపట్నం జిల్లాలో 6,922 కార్డులకు , విజయనగరం జిల్లాలో 1,603 కార్డులకు , పశ్చిమగోదావరి జిల్లాలో 2,048 కార్డులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది . ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 173 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒక లక్షా 30 వేల 815 బియ్యం కార్డుదారులకు 2,369 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 114 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశారు . చిత్తూరు జిల్లాలో 124 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా 85 వేల 374 బియ్యం కార్డుదారులకు 1,496 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 56 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశారు . తూర్పుగోదావరి జిల్లాలో 191 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒక లక్షా 56 వేల 493 బియ్యం కార్డుదారులకు 2,435 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 58 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఇవ్వడం జరిగింది.
గుంటూరు జిల్లాలో 243 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా 2 లక్షల 20 వేల 055 బియ్యం కార్డుదారులకు 3 వేల 541 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 128 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఇచ్చారు . వైఎస్సార్ కడప జిల్లాలో 138 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒక లక్షా 23 వేల 174 బియ్యం కార్డుదారులకు 2 వేల 187 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 99 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశారు . కృష్ణాజిల్లాలో 261 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా 2 లక్షల 29 వేల 431 బియ్యం కార్డుదారులకు 3 వేల 680 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 114 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశారు . కర్నూలు జిల్లాలో 194 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒక లక్షా 62 వేల 351 బియ్యం కార్డుదారులకు 2 వేల 867 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 148 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఇవ్వడం జరిగింది . నెల్లూరు జిల్లాలో 125 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒక లక్షా 02వేల 518 బియ్యం కార్డుదారులకు 1,654 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 37 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఇచ్చారు . ప్రకాశం జిల్లాలో 79 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా 89 వేల 609 బియ్యం కార్డుదారులకు 1,460 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 66 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో 52 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా 50 వేల 773 బియ్యం కార్డుదారులకు 849 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 45 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశారు . విశాఖపట్నం జిల్లాలో 284 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా 2 లక్షల 36 వేల 905 బియ్యం కార్డుదారులకు 3 వేల 847 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 138 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఇవ్వడం జరిగింది . విజయనగరం జిల్లాలో 78 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా 68 వేల 753 బియ్యం కార్డుదారులకు 1,153 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 48 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశారు . పశ్చిమగోదావరి జిల్లాలో 126 మొబైల్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒక లక్షా 35 వేల 245 బియ్యం కార్డుదారులకు 2 వేల 163 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యం , 52 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశారు .