Andhra PradeshKurnoolPolitical

రాష్ట్రంలో మహిళలు బతికే హక్కు లేదా..?

  • వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళపై దాడులు పెరిగిపోయాయి
  • మొన్న పులివెందుల, నిన్న ప్రకాశం, నేడు అనంతపురం
  • బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ మహిళల రక్షణ కరువైంది
  • స్నేహాలతను హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలి
  • మహిళల రక్షణకు కఠినమైన చట్టాలు తీసుకురావాలి
  • తెలుగు మహిళా కర్నూల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సుకన్యదేవి డిమాండ్
    కర్నూల్ డిసెంబర్ 24 : వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు లేకుండా పోతోందని తెలుగు మహిళ కర్నూల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఈ.సుకన్యదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక విజయవాడలో ఓ విద్యార్థిని ఇంట్లోకి వెళ్లి గొంతు కోసి చంపితే.. రాజమండ్రిలో మైనార్టీ వర్గానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశారని అన్నారు. మరో పక్క సాక్ష్యాత్తు సీఎం జగన్ నియోజకవర్గమైన పులివెందులలో దళిత మహిళ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందేనన్నారు. ఈ ఘటన మరువకముందే ప్రకాశం జిల్లాలో వికలాంగురాలైన ఓ మహిళా వాలంటీర్ తమ పని చేయలేదని కొంత మంది దుండగులు తన ట్రై సైకిల్లోనే పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశారన్నారు. నేడు అనంతపురం జిల్లాలో ప్రేమ పేరుతో స్నేహలత అనే దళిత యువతిని దారుణంగా హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. చెప్పిన పని చేయలేదని ఒక్కడు.. ప్రేమ పేరుతో మరొక్కడు, తన కోరికలు తీర్చలేదని మరొకడు మహిళలు, యువతలు, చివరకు మైనర్ బాలికలపై దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చామని జగన్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుందని, అది చట్టం కాకముందే.. స్టేషన్లు, అధికారులను నియమించి హడావుడి చేశారని, కానీ ఈ చట్టం లోప భూయిష్టంగా ఉందని కేంద్రం తిప్పి పంపిందని అన్నారు. దిశ చట్టం కింద ఒక్కరిని కూడా శిక్షించిన దాఖలాలు లేవన్నారు. దీంతో మృగాళ్లు రెచ్చిపోయి యథేచ్ఛగా మహిళలు, యువతులపై దాడులు, హత్యలు, హత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలకు కష్టం వస్తే.. గన్ లో బుల్లెట్ రావడం ఆలస్యం అవుతుందేమో కానీ.. మా జగన్నన్న రావడం ఆలస్యం కాదని వైసీపీ నేత రోజా చెప్పారని, కానీ రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. అన్న రాలేదు, గన్ లో బుల్లెట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ప్రచారం తో డబ్బా కొట్టుకోవడం తప్ప మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి స్నేహాలతను అత్యంత కిరాతకంగా హత్యచేసిన మృగాళ్లను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, అలాగే మహిళల రక్షణకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళ రక్షణకు, జీవించే హక్కు ను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.

Mana Jana Pragathi

Mana Jana Pragathi is one of the Best Telugu Daily News Paper. Readers get the latest information around the world on time from their mobile device. Readers can browse category wise news like political, cinema, education and sports etc. Readers can browse daily paper at our paper portal.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected a AdBlocker on your browser, please add us for the exemption to support us.