రాష్ట్రంలోని జర్నలిస్టులకు టిడ్కో ఇళ్లను కేటాయించాలి
కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు వెంటనే ఇవ్వాలి
అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు అందజేయాలి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి
మచ్చా రామలింగారెడ్డి
(రాష్ట్ర అధ్యక్షులు, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ) విజ్ఞప్తి చేశారు
అనంతపురం డిసెంబర్ 19:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఇప్పటికే టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను జర్నలిస్టుల అందరికీ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేశారు.
టిడ్కో ద్వారా నిర్మించిన ఇల్లు సింగల్ బెడ్ రూమ్, డబల్ బెడ్ రూమ్ ఇల్లు త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం ఎవరికి కేటాయించలేదు కాబట్టి వెంటనే ఇళ్లను రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ కేటాయించాలి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
ఈరోజు అనంతపురం R&B గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ మచ్చా రామలింగారెడ్డి.. డిసెంబర్ 25న రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాలు ఇవ్వాలని టిడ్కో ఇల్లు పంపిణీ చేయాలని, ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని, జర్నలిస్టులను ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా కరోనాలో మృతి చెందిన జర్నలిస్టులకు 5 లక్షలు వెంటనే చెల్లించాలని మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వారిని ఆదుకోవాలని మచ్చా కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా 40 మందికి పైగా జర్నలిస్టులు కరోనాతో మృతిచెందారని వారి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వెంటనే ఆర్థిక శాఖ, సమాచార శాఖ అధికారులు నిధులు విడుదల చేసి ఆదుకోవాలన్నారు.
13 జిల్లాల్లో టిడ్కో ద్వారా ప్రభుత్వం ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలతో పాటు నగరాల్లో కూడా చేరడానికి అనువుగా ఉన్నాయని వాటిని రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు జర్నలిస్టులకు ఆ ఇల్లు కేటాయిస్తే జర్నలిస్టులు చిరస్థాయిగా వైయస్ జగన్ పేరు గుర్తుంచుకుంటారాని పరిశీలించి వెంటనే న్యాయం చేయాలని జర్నలిస్టులను ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు
రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు జర్నలిస్టులందరికీ ఆ ఇళ్లను కేటాయించాలని రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరూ ఇదే అంశం మీద మాట్లాడాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు.రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎం జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలని అన్నారు.సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరాజు, ఆంధ్రప్రభ రాజా శ్రావణ్, కుల్లాయస్వామి, జానీ, హనుమంతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.