రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి కీలక ఆటగాడు ఐపీఎల్ సీజన్ 2021 కి అందుబాటులో ఉండడం లేదు
విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి కీలక ఆటగాడు ఐపీఎల్ సీజన్ 2021 కి అందుబాటులో ఉండడం లేదు. సౌతాఫ్రికా క్రికెటర్ అయిన డేల్ స్టెయిన్ ఐపీఎల్ 2021 సీజన్ కోసం అందుబాటులో ఉండడం లేదని ప్రకటించాడు. ‘అందరికీ ఓ చిన్న సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ కోసం నేను అందుబాటులో ఉండడం లేదు. నేను మరో టీమ్‌కు కూడా ఆడడం లేదు. కేవలం చిన్న బ్రేక్ తీసుకోవడం కోసమే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆడడం లేదు. ఇంకో విషయం. నేను రిటైర్ కావడం లేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు ఆర్సీబీకి ధన్యవాదాలు.’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో కేవలం కుటుంబంతో గడపడానికి, ఈ నిర్ణయం తీసుకున్నాడని భావించాడు. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చాడీ ఆర్సీబీ ప్లేయర్.తాను మరో లీగ్ ఆడడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పాడు. ‘నేను మరో లీగ్ (ఐపీఎల్ 2021 కాకుండా) ఆడుతున్నా. నేను ఎంతో ఉత్సుకతతో చూస్తున్న గేమ్ ఆడేందుకు ఆర్సీబీ నుంచి తప్పుకున్నా. మళ్లీ చెబుతున్నా. నేను రిటైర్ కావడం లేదు.’ అని మరో ట్వీట్ చేశాడు.ఒకప్పుడు ఐపీఎల్‌లో మంచి పేసర్‌గా గుర్తింపు పొందాడు డేల్ స్టెయిన్. అయితే, గత ఐదేళ్లుగా పెద్ద ప్రభావం చూపడం లేదు. IPL 2016లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రెండు సీజన్లకు అందుబాటులో లేడు. 2019లో అసలు ఎవరూ తీసుకోలేదు కూడా. అయితే, రీప్లేస్ మెంట్ కింద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు. భుజం గాయం కారణంగా 2019 వరల్డ్ కప్‌కి కూడా అందుబాటులో లేడు. 2020లో మళ్లీ ఆర్బీసీలో రూ.2కోట్లకు వచ్చినా కూడా పెద్ద ప్రభావం చూపించలేదు. ఐపీఎల్‌లో మొత్తం 95 మ్యాచ్‌లు ఆడిన డేల్ స్టెయిన్ 97 వికెట్లు తీసుకున్నాడు.