Kurnool
రాయలసీమ షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభo.క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న పరుశ రాముడు.
కర్నూలు డిసెంబర్ 22
కర్నూలు జిల్లా బనగానేపల్లె క్రీడమైదానం లో రాయలసీమ జోన్ షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఆంద్రప్రదేశ్ షూటింగ్ బాల్ ప్రధాన కార్యదర్శి పరుశ రాముడు హాజరయ్యారు. అనంతర క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతర వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ…. క్రీడలు వలన మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహం పెరుగుతుంది అని, షూటింగ్ బాల్ క్రీడా కు మంచి ఆదరణ లభిస్తోంది అని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు విజయవాడలో జరిగే సెంట్రల్ పోటీలకు అర్హత సాధిస్తాయని తెలిపారు. నాలుగు జిల్లాలనుంచి నలబై బాలుర క్రీడాకారులు హాజరయ్యారని , వారికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని పోటీల నిర్వాహకుడు నాగరాజ్ తెలిపారు.