రాయచోటికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు జి ఓ విడుదలపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు.ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
రామాపురం న్యూస్ డిసెంబర్ 22 రాయచోటికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ జి ఓ విడుదల చేయడంపట్ల ప్రభుత్వానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.స్థానికంగా ఉన్న పెద్దల అభ్యర్థనల మేరకు మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఉన్నత విద్యాశాఖ మండలి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ల దృష్టికి తీసుకుళ్లామన్నారు.వారు అనుకూలంగా స్పందించి జి ఓ విడుదల చేయడం హర్షణీయమన్నారు.రాయచోటి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలోనే హైస్కూల్ నుంచి డిగ్రీ స్థాయి చదువుల వరకు ఒకే ప్రాంగణం లోనే అధునాతన వసతులు, సాంకేతికతతో కూడిన విద్యను అందించే ఏర్పాట్లు చేయనున్నామన్నారు.ఒకే ప్రాంగణంలోనే బాలికలకు ఈ కళాశాలల ఏర్పాటు వారి విద్యావ్యాప్తికి దోహదం చేస్తాయన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచే మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమవుతాయన్నారు.ఈ కళాశాలలో ఉర్దూ మీడియం వారికి అవకాశం ఉంటుందన్నారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా డిమాండ్ ఉన్న డిగ్రీ కోర్సులను ఏర్పాటు చేసి, తద్వారా వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందుతాయన్నారు.మహిళా డిగ్రీ కళాశాల మంజూరు పట్ల ముఖ్యమంత్రి జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లకు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.