రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్ మన జనప్రగతి డిసెంబర్ :-28 దేశంలో ఇప్పటికీ ప్రతి రోజు కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. చాలామంది ఈ మహమ్మారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోగా మరికొంత మంది మృతి చెందారు. ఇక టాలీవుడ్ లో చాలా మంది కరోనా బారిన పడగా ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నెగిటివ్ వచ్చింది. కిట్ లోపం కారణంగానే పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇదిలా ఉండగా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అంటూ స్వయంగా రామ్ చరణ్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని తనకి ఎటువంటి లక్షణాలు లేవని రామ్ చరణ్ తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.