రాత్రికి రాత్రి ఇద్దరు జడ్డీలను మార్చడం దారుణమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అ

రాత్రికి రాత్రి ఇద్దరు జడ్డీలను మార్చడం దారుణమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు చెబితే స్పెషల్ ఆఫీసర్ల జీవో తెచ్చారని, జీవోను అడ్డంపెట్టుకొని మళ్లీ కోర్టుకు వెళ్తారన్నారు. అన్నీ తెలిసి కూడా కోర్టు ధిక్కార ధోరణితో వెళ్తున్నారని తప్పుబట్టారు. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.మరోవైపు సోమవారం తాడిపత్రిలో జేసీ సోదరుల ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను రాజకీయాలకు వాడుకుంటున్నారని దీక్ష చేపట్టనున్నారు. దాంతో తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్టు అమలు చేశారు.తాడిపత్రిలో ముందు జాగ్రత్తగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాల ముందు నుంచి భారీ కవాతు నిర్వహించారు. ర్యాలీలు, ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరని డీఎస్పీ చైతన్య తెలిపారు.