రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డిని మంత్రి ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం
రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలి.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందనడానికి పెద్దిరెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం..
-వి.ఎస్.అమీర్ బాబు, కడప అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జి.
కడప, ఫిబ్రవరి 06:- కో.ఆపరేటివ్ కాలనీలోని తన స్వగృహాంలో జరిగిన పత్రిక సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల పట్ల మాట్లాడిన తీరును ఖండించిన అమీర్ బాబు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను బ్లాక్ మెయిల్ చేసేలా ప్రకటన చేయడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే.రిటర్నింగ్ అధికారులను ఎన్నికల కమీషన్ నిర్ధేశించిన విధులలో పాల్గొనొద్దని చెప్పడం బాహాటంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటమే అని విమర్శించారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కేటాయించిన విధుల్లో అధికారులు పాల్గొంటారనే విషయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకపోవడం సిగ్గుచేటు.చీకట్లో పంచాయతీలు చేయడం మాని చట్టం గురించి తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు రాత్రింబవళ్లు పనిచేస్తున్న అధికారులను పెద్దిరెడ్డి అవమానపరుస్తూ హెచ్చరికలు జారీ చేయడం దుర్మార్గం ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చని పెద్దిరెడ్డి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనంమంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు విధి నిర్వహణలో ఉన్న అధికారులకు ఆటంకం కలిగించేలా… ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా. భారత రాజ్యాంగాన్నే అవమానించేలా ఉన్నాయి.ఎన్నికలు సజావుగా జరగాలంటే పెద్దిరెడ్డిపై తక్షణమే గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ నుండి తొలగించి కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు పెద్దిరెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకుంటే స్థానిక సంస్థల ఎన్నికలే వేదికగా ప్రజలందరూ వైకాపా బలపరిచిన అభ్యర్థులను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు1ఈ సమావేశంలో గడ్డ గుర్రప్ప, మాసా కోదండ రామ్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.