రాజకీయ నిద్రలు చేస్తున్న పవన్ కళ్యాణ్ మంత్రి రోజా

తిరుమల మన జనప్రగతి అక్టోబర్ 10:-
పవన్ కళ్యాణ్ కుంభకర్ణు డిలా రాజకీయం లో నిద్రలు చేస్తున్నా రని ఏపి మంత్రి ఆర్.కే.రోజా విమ ర్శించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమ యంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆల య వెలుపలకు వచ్చిన మంత్రి ఆర్.కే.రోజా మీడియా తో మాట్లాడుతూ.. తమిళనాడు కోడలిగా పెరటాశి మాసంలో స్వామి వారి ఆశీ స్సులు తీసుకోవడం చాలా సంతోషం గా ఉందని చెప్పారు.మూడు రాజధానుల తో మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని, హైదరాబాద్ నుంచి విడిపోయిన నేపథ్యంలో చాలా కాలం ఇబ్బందులు పడ్డామని చెప్పా రు. అలాంటి ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ అలో చించి మూడు రాజధానులు అంశం తీసుకొచ్చారని ఆమె వివరించారు. తెలుగు దేశం పార్టీ నాయకులు, నానాయాగీ చేస్తూ ప్రాంతాలను రెచ్చ గొడుతున్నా రని, వైజాగ్ ప్రాంతంలో పాదయాత్ర పెట్టి తొడలు కొడుతూ వెళ్తున్నారని ఆమె విమర్శించారు.29 గ్రామాల కోసం, 26 జిల్లాలను పణంగా పెట్టాలని ఎవరు కోరుకోరని, 40 ఏళ్ల అనుభవం తో 5 ఏళ్ళ కాలంలో చంద్రబాబు ఎందు కు అభివృద్ధి చేయలేక పోయా రని ఆమెఅన్నారు. తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించారని, శాశ్వత భవనాలు ఎక్కడ నిర్మించలే దన్నారు.అమరావతి ఉద్యమం కాదని అత్యాశ పరుల ఉద్యమం అని ఆమె మండిపడ్డారు.తలసరి ఆదాయం బాగా ఉన్న అమరా వతిని అభివృద్ధి చేయాలంటే 1.10 లక్షల కోట్ల రూపా యలు నిధులు వ్యాచించి అభివృద్ది చేయాలని, 29 గ్రామాలు అభివృద్ధి కన్నా 26 జిల్లాలు అభివృద్ధి చెందా లని కోరుకోవడంలో ఏం తప్పు ఉందన్నారు.పరిపాలన రాజధాని వైజాగ్ లో టీడీపీ పాదయాత్ర చేపట్టి, ప్రాంతా ల మధ్య ద్వేషాలు చిచ్చురేపి రాజకీయంగా లబ్ది పొం దాలని చూస్తుందన్నారు. అందుకే చంద్రబాబు, లోకేష్ లు అలాంటి కార్యక్రమం చేపట్టారని తెలుస్తోందని, పవన్ కళ్యాణ్ కుంభ కర్ణుడిలా 6 నెలలు నిద్రపోవడం మేల్కునట్లు రాజకీయం చేస్తున్నాడని, అప్పుడప్పుడు రాజకీయాల్లో ప్రెస్ మీట్, ట్వీట్ లతో సరిపెట్టుకుంటు న్నాడని సీరియస్ పొలిటిషన్ గా ప్రజ లకు ఏం చేసా డని ఆని ప్రశ్నించారు