రాచపూడి కళాశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు
బద్వేలు,డిసెంబర్ 22 :
రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మంగళవారం రామానుజన్ జన్మదినోత్సవ సందర్భంగా జరుపుకునే జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఎన్సీసీ యూనిట్లు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.రాచపూడి కళాశాల బీఎస్సీ గణిత విభాగం విద్యార్థినీ విద్యార్థులు ముందుగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేశారు.అనంతరం కళాశాల సీనియర్ అధ్యాపకులు జబ్బార్ సార్ విద్యార్థులకు సందేశ మిస్తూ తమిళనాడు లో జన్మించిన శ్రీనివాస రామానుజన్ గారు భారతీయ గణిత శాస్త్రానికి గారు వన్నె తెచ్చారన్నారు. ఆయన వ్రాసిన మేజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ ప్రపంచఖ్యాతి గడించాయన్నారు.3900 సమీకరణాలు కనుక్కొని చరిత్ర సృష్టించాడన్నారు. గణితానికి మానవ జీవితానికి విడదీయరాని బంధం ఉందని సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమములో కళాశాల పరిపాలన అధికారి శ్రీ ఆర్. వి.సాయి కృష్ణ గారు, ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణ గారు,గణిత అధ్యాపకులు శ్రీ జబ్బార్ సార్ గారు, అధ్యాపక బృందం, గణిత విభాగ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.