రహీం పౌండేషన్ అద్వర్యం లో ఉచిత మెగా వైద్య శిబిరం
- రహీం పౌండేషన్ అద్వర్యం లో ఉచిత మెగా వైద్య శిబిరం…..
- సామాజిక సేవ గొప్ప లక్షణం…
- మానవ సేవే.. మాధవ సేవ…
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా..
కడప,ఫిబ్రవరి 14:రహీం ఫౌండేషన్ ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు.
ఆదివారం నాగరాజు పేట లో ఏర్పాటుచేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అంజాద్బాష ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహీం ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన తండ్రి సామాజిక సేవా గుణాలను వారి తనయులు కొనసాగిస్తూ కడప నగర వాసులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. కడప నగర ప్రజల కోసం ఈ ట్రస్టు ద్వారా అనేక ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారని, అలాగే కరోన సమయంలో కూడా వారు అనేక సేవలు అందించారని తెలిపారు. ఇటీవల బుగ్గవంక కు వరదలు వచ్చిన సమయంలో కూడా ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించడం జరిగిందన్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి పేద ప్రజలు ఎంతో డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని అలాంటి పేద ప్రజలకు కోసం మన ప్రాంతంలో నే అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ప్రముఖ డాక్టర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజలకు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. అలాగే ఈ ట్రస్టు ద్వారా రాబోవు కాలంలో కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రహీం ఫౌండేషన్ సభ్యులు వల్లి, హాజి, 30 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షఫీ, మాజీ కార్పొరేటర్ అల్తాఫ్, వైఎస్సార్ సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.