మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థికి కీలకం కానున్న జనసేన

కడప మార్చి 13:- జిల్లా క్యాంపు రాజకీయాలకు తెర లేపుతున్న మైదుకూరు మున్సిపాలిటీ. మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థికి కీలకం కానున్న జనసేన వార్డు కౌన్సిలర్మత్తము 24 వార్డులకు గాను 12 టిడిపి, 11 వైసిపి, 1 జనసేన కైవసం చేసుకుంది. జనసేన మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు.అజ్ఞాతంలో జనసేన పార్టీ అభ్యర్థిఇప్పటికే ఇరు పార్టీల నేతలు తమ అభ్యర్థులను ప్రత్యేక బస్సులో పక్క రాష్ట్రలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏదేమైనప్పటికీ మైదుకూరు మున్సిపాలిటీ పీఠం ఎవరికి దక్కేనో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొందరైతే ఒక్కటి గెలిచిన జనసేనకే చైర్ పర్సన్ సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని, లేకుంటే వైస్ చైరపర్సన్ పీఠం దగ్గర వకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఏదేమైనా మైదుకూరు మున్సిపాలిటీ లో జనసేన క్రేజ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
జనసేన అభ్యర్థి తమ నాయకుల కృషితోనే గెలుపొందారని ఒక్కటి గెలిచినా చైర్మన్ పదవిలో కీలకంగా వ్యవహరించడం జనసేనకు కలసి వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు