Andhra PradeshAnanthapurLatest NewsPoliticalTelangana
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతించాలి జేసీ ప్రభాకర్ రెడ్డి

అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‍రెడ్డితో పాటు మరో నలుగురు పిటిషన్ దాఖలు చేశారు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని కోరుతూ వారు పిటిషన్ వేశారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను చింపేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్‌కు స్వీకరించిన ధర్మాసనం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.