మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

నామినేషన్లు దాఖలకి చివరి తేది ఈ నెల 14 వరకు
నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు
నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్, 6న కౌంటింగ్
హైదరాబాద్ అక్టోబర్ 7
నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని తెలిపింది. నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.చండూరు తాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శని, ఆదివారల్లో మినహా ఈ నెల 14 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామపత్రాలు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని వెల్లడించారు.