ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
బద్వేలు ,జనవరి 11 మన జనప్రగతి న్యూస్:-
టెన్నీస్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కడప జిల్లా స్థాయి పోటీలను యస్బివిఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగిందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేముల వెంకటసుబ్బయ్య తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి5 టీమ్లతో 60 మంది క్రికెట్ క్రీడాకారులు ఫాల్గొన్నారని,
కళాశాల డీన్ డాక్టర్ బి. రామ లక్ష్మి రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఆటను ప్రారంభిచగా
విజేతలుగా ప్రథమ బహుమతి రవికుమార్ టీమ్, ద్వితీయ బహుమతి వంశీ టీమ్, తృతీయ బహుమతి ఆంజనేయులు టీమ్ అందుకొన్నారన్నారు. ఈ బహుమతులను ప్రిన్సిపాల్ కేవీ సుబ్బారెడ్డి, విశిష్ట అతిథులు యస్సి కార్పొరేషన్ వెంకట సుబ్బయ్య, యస్బిఐ
చీఫ్ మేనేజర్రవికుమార్, చింతంరెడ్డి రామచంద్రారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ పాపుదిప్పు మురళి కృష్ణా రెడ్డి, రామచంద్ర, బోవిళ్ళ నందగోపాల్ రెడ్డి ఫాల్గొని అందజేశారన్నారు.క్కు బాదిరెడ్డి వెంకట రామిరెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో సముద్రాల శ్రీనివాసులు, శంభుప్రసాద్, చక్రి, గౌరీ శంకర్ ఫాల్గొని జయ ప్రదం చేశారు.