మిషన్ ముఖ్యమంత్రి అని తేలిపోయింది.. -జనం ఓట్లతో జగన్ గెలవలేదు
మిషన్ ముఖ్యమంత్రి అని తేలిపోయింది..
-జనం ఓట్లతో జగన్ గెలవలేదు
-ఈవీఎంలపై మరింత బలపడిన అనుమానాలు
-తెలుగు మహిళ ప్రధానకార్యదర్శి సుకన్యదేవి
కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో స్పష్టంగా తేలిపోయిందని జిల్లా తెలుగు మహిళ ప్రధానకార్యదర్శి ఈ.సుకన్యదేవి పేర్కొన్నారు. తాజాగా రెండు విడతలు జరిగిన గ్రావుపంచాయితీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి భారీ విజయాన్ని చేకూర్చి పెట్టడం చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ప్రజల ఓట్లతో ఆ పదవి చేపట్టలేదని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయుడం ద్వారా పదవిలోకి వచ్చినట్లు ఇప్పటివరకు ఉన్న అనుమానాలు మరింత పెరిగాయని ఆమె వెల్లడించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో కుమ్మక్కై అక్రమ పద్ధతుల్లో అధికారం చేపట్టారని ఆమె మండిపడ్డారు. జగన్ జనం వెనుక ఉన్న ముఖ్యమంత్రి కాదని, మిషన్ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారన్నది ప్రజలు రుజువు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కారణంగానే ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజావ్యతిరేకంగానే ఉంటుందని సుకన్య అన్నారు. సాధారణంగా ఏ పదవిలో ఉన్నా ప్రజా ఆమోద నిర్ణయాలను తీసుకుంటూ తమ ప్రాంత, జిల్లా, రాష్ట్రాభివృద్ధికి నాయకులు కృషి చేస్తారని ఆమె గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి పక్కనబెట్టి ప్రతిపక్షాలపై, ప్రజలపై దాడులు చేస్తూ పాలన కొనసాగిస్తున్నారే తప్ప ఎక్కడా చిన్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు కేవలం 18 నెలల కాలంలో కర్నూలు వద్ద విమానాశ్రయాన్ని నిర్మించారని, ముస్లిం విద్యార్థుల కోసం ఉర్దూ యూనివర్శిటి ఏర్పాటు చేశారని, అలాగే పడమర ప్రాంత రైతుల కోసం హెచ్‌ఎన్‌ఎస్ నుంచి నీటిని చెరువులకు తరలించేందుకు ఆదేశాలు జారీ చేసి అవసరమైన నిధులు మంజూరు చేశారని ఆమె గుర్తు చేశారు. అంతేగాక తుంగభద్ర దిగవ కాలువ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడం కోసం కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ పనులకు పూర్తి
స్థాయి నివేదిక సిద్ధం చేసి పరిపాలన పరమైన ఆమోదం తెలిపి నిధుల కేటాయింపు కూడా చేశారని ఆమె అన్నారు. అలాగే గుండ్రేవుల, ఆర్‌డిఎస్ కుడికాలువ, గురురాఘవేంద్ర పెండింగ్ పనులకు నిధుల కేటాయింపు చేశారని ఆమె అన్నారు. వీటన్నింటిని పక్కనపడేసి జగన్ అభివృద్ధి నిరోధకుడిగా మారాడని ఆమె మండిపడ్డారు. తాను సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రానా ప్రజాజీవితం బాగుపడదన్న సత్యం తెలుసుకోవాలని ఆమె సూచించారు. రాక్షసుడిగా తాను చెప్పిందే జరగాలని ప్రజలను ఆదేశిస్తే అది సాధ్యపడేది కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్దతులను మార్చుకొని అభివృద్ధికి శ్రీకారం చుట్టకపోతే త్వరలోనే ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు సముద్రంలో విసిరేయుడం ఖాయమని సుకన్య అన్నారు.