Andhra PradeshCinemaTelangana
మాస్ రాజా రవితేజ క్రాక్ మూవీ విడుదలైంది.
హైదరాబాద్ మన జనప్రగతి న్యూస్ : మాస్ రాజా రవితేజ క్రాక్ మూవీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఇవాళ విడుదల కావాల్సిన ఈ మూవీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మొదట్లో వాయిదా పడింది. ఉదయం షో క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశగా థియేటర్స్ ఉంచి వెనుతిరిగారు. కనీసం మ్యాట్నీ అయినా సినిమాను ఎంజాయ్ చేద్దామనుకుంటే జనవరి 9న సినిమా విడుదల కావడం లేదంటూ చెప్పారు. దీంతో అభిమానులతో పాటు ఆడియన్స్ నిరాశగా వెనుతిరిగారు. అయితే చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా మూవీ విడుదలను ప్రకటించారు. సమస్యలన్నీ తీరాయని మూవీని ఈ రోజే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ షో నుంచి సమీపంలోని థియేటర్స్‌కి వెళ్లి మూవీని చూడొచ్చని పేర్కొన్నారు.