Andhra PradeshPrakasam
మాజీ ప్రధాని ఏ బి వాజపేయి జయంతి వేడుకలు
విజయవాడ మన జనప్రగతి:-
మాజీ ప్రధాని ఏ బి వాజపేయి జయంతిని పురస్కరించుకుని విజయవాడ సత్యనారాయణపురం శివాజీకేఫ్ సెంటర్లో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరశింహారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజపేయి జీవితం మనకు ఆదర్శమని, వారు అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి అవినీతి రహితంగా సాగిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ భాజపా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్, పార్టీ రవిశంకర్ , 33వ డివిజన్ భాజపా కార్పొరేటర్ అభ్యర్థి నాగలింగం శివాజీ తదితరులు పాల్గొన్నారు.