Andhra PradeshLatest NewsYSR Kadapa
మహిళ హత్య.. సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలు
- మైనర్లే నిందితులు
- మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు
- ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడి
మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితులను మైనర్లుగా గుర్తించారు. నిందితులను కడప బాలుర గృహంలోని పర్యవేక్షక గృహానికి పంపించారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శనివారం విలేకరులకు వెల్లడించారు. ఈనెల 7న లింగాల పోలీసులకు పెద్దకుడాల సమీపంలోని గుట్టలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామంలో వారు విచారించగా ఈ మృతదేహం అదే గ్రామానికి చెందిన నాగమ్మ(45)దిగా గుర్తించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి స్వీయపర్యవేక్షణలో మరుసటి రోజునే మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ హత్యకు గురైనట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వచ్చింది. అప్పటికే హత్య కేసుగా నమోదు చేశారు.