మహిళా, శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
అనంతపురం, డిసెంబర్ 22:
మహిళా, శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండలంలోని అమ్మవారిపేట గ్రామంలో మంగళవారం ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ శిశువులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచించారు..ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ భవనాన్ని నిర్మించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం గర్భవతులకు శ్రీమంతం నిర్వహించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, ఆర్డిటి సంస్థ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఆర్డిటి రిసోర్స్ పర్సన్ సాగర్ మూర్తి, రీజనల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, తహశీల్దార్ మహబూబ్ భాషా, ఎంపీడీవో తేజోష్ణ, డిసిపిఓ సుబ్రహ్మణ్యం, సిడిపిఓ ఉమా శంకరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.