మరో వైరస్ మరింత భయాందోళనలకు గురిచేస్తోంది.చనిపోయిన కాకులతో వచ్చే బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనావైరస్, కొత్త రకం కరోనావైరస్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే రాజస్థాన్‌లో వెలుగుచూసిన మరో వైరస్ మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కేంద్రం రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. చనిపోయిన కాకులతో వచ్చే బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రం..చనిపోయిన కాకులలో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించిన తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో పరస్థితి మరింత దిగజారింది.మూడు రోజుల క్రితం చనిపోయిన కాకులలో ఈ వైరస్ గుర్తించినట్లు అక్కడి వైద్య అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రమంతా ఈ వైరస్ పట్ల హై అలర్ట్‌తో ఉన్నట్లు తెలిపారు.
రాజస్థాన్ రాష్ట్రంలో భారీగా చనిపోతున్న కాకులు.. హైఅలర్ట్
రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుంజీ లాల్ మీనా ఆదివారం మాట్లాడుతూ.. కోటాలో ఇప్పటి వరకు 47 కాకులు మరణించినట్లు తెలిపారు. ఝాలవర్ ప్రాంతంలో 100, బరన్‌లో 72 కాకులు చనిపోయినట్లు వెల్లడించారు. బుండిలో ఇప్పటి వరకు కాకులు ఏమీ చనిపోలేదన్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శనివారం ఒక్క రోజులోనే ఝలవర్‌లో 25 కాకులు, బర్రాలో 19, కోటాలో 22, జోధ్‌పూర్‌లో 152 కాకులు మృతి చెందనిట్లు అధికారులు తెలిపారు. మరిన్ని ప్రాంతాల్లో కూడా కాకులు మరణించినట్లు సమాచారం ఉందని చెప్పారు. కింగ్ ఫిషర్స్, మాగ్‌పీస్ లాంటి పక్షులు కూడా చనిపోయినట్లు గుర్తించామని వివరించారు. ఝలావర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసినట్లు మీనా తెలిపారు.ఇది ఇలావుండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ గుర్తంచారు. చనిపోయిన దాదాపు 50 కాకుల్లోనూ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు తేలడం గమనార్హం. దీంతో ఇక్కడ కూడా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఇండోర్ డిప్యూటీ డైరెక్టర్ ప్రమోద్ శర్మ మాట్లాడుతూ.. డాలీ కాలేజీ ప్రాంగణంలో 70 కాకులు చనిపోయాయని తెలిపారు. వీటిలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందా? లేదా? అనేది నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఇండోర్ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండగా, ఈ బర్డ్ ఫ్లూ జనాలను మరింతగా భయపెడుతోంది.మనుషులకూ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలుఈ నేపథ్యంలో కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బర్డ్ ఫ్లూ మరణాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో నమూనాలను సేకరించి, పరీక్షించాలని ఆదేశించింది. ఈ బర్డ్ ఫ్లూ చనిపోయిన కాకులతో మనుషులకు వచ్చే ప్రమాదం ఉండే అవకాశం ఉండటంతో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాకులు చనిపోయిన ప్రాంతాల్లో ఎవరైతే జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో ఉన్నారో.. వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది. వారికి పరీక్షలు కూడా నిర్వహించాలని స్పష్టం చేసింది. కాకులు పెద్ద ఎత్తున చనిపోయిన ప్రాంతాల్లోకి ప్రజలను వెళ్లనీయకుండా చూడాలని ఆదేశించింది.
ఇది ఇలావుండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ గుర్తంచారు. చనిపోయిన దాదాపు 50 కాకుల్లోనూ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు తేలడం గమనార్హం. దీంతో ఇక్కడ కూడా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఇండోర్ డిప్యూటీ డైరెక్టర్ ప్రమోద్ శర్మ మాట్లాడుతూ.. డాలీ కాలేజీ ప్రాంగణంలో 70 కాకులు చనిపోయాయని తెలిపారు. వీటిలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందా? లేదా? అనేది నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఇండోర్ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండగా, ఈ బర్డ్ ఫ్లూ జనాలను మరింతగా భయపెడుతోంది.మనుషులకూ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలుఈ నేపథ్యంలో కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బర్డ్ ఫ్లూ మరణాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో నమూనాలను సేకరించి, పరీక్షించాలని ఆదేశించింది. ఈ బర్డ్ ఫ్లూ చనిపోయిన కాకులతో మనుషులకు వచ్చే ప్రమాదం ఉండే అవకాశం ఉండటంతో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాకులు చనిపోయిన ప్రాంతాల్లో ఎవరైతే జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో ఉన్నారో.. వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది. వారికి పరీక్షలు కూడా నిర్వహించాలని స్పష్టం చేసింది. కాకులు పెద్ద ఎత్తున చనిపోయిన ప్రాంతాల్లోకి ప్రజలను వెళ్లనీయకుండా చూడాలని ఆదేశించింది.