AnanthapurAndhra Pradesh
మద్దలచెరువు గ్రామంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, గంగుల సూర్యనారాయణరెడ్డి విగ్రహాలు ఆవిష్కరన
మండలంలోని మద్దలచెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, గంగుల సూర్యనారాయణరెడ్డి విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. మద్దలచెరువు సూర్యనారాయణరెడ్డి 10వ వర్థంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్షన్ రహిత పాలన అందిస్తోందని చెప్పారు. హంద్రీనీవా ద్వారా పేరూరు డ్యామ్ కు ఫిబ్రవరి లోపు నీరు తీసుకొచ్చి లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో రాప్తాడు నియెజవర్గ సీనియర్ వైసిపి నాయకులు చందు, గంగుల భానుమతి, కనగాన పల్లి వైసిపి మండల కన్వీనర్ అమర్నాథ్ రెడ్డి, మారుతి, బోయగిరిజమ్మ, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.