భారీగా గంజాయి స్వాధీనం, 5 మంది స్మగ్లర్లు అరెస్టు,
కడప మన జనప్రగతి జులై 23:- జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కే. కే. ఎన్ అన్బురాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 260 కిలోల గంజాయి, టవేరా కారు, రూ. 3850 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చూసుకుని 5 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి నుండి అక్రమ రవాణా చేస్తూ కడపకు తరలిస్తున్న తరుణంలో గంజాయి సీజ్ చేశామన్నారు.
5 మంది గంజాయి స్మగ్లర్లను చిన్నచౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇరువురు స్మగ్లర్ల పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పి తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్. పి కే. కే. ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం. దేవ ప్రసాద్, కడప డి. ఎస్. పి సునీల్, చిన్నచౌక్ సి. ఐ అశోక్ రెడ్డి, ఎస్. ఐ అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.