బాలకృష్ణకు హిందూపూర్ ఎన్నికల్లోషాక్
నందమూరి బాలకృష్ణకు తన నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ మద్దతు దారులు మెజార్టీ స్థానాలను గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలోనూ బాలయ్య హిందూపూర్ నుంచి గెలుపొందారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆయన సత్తా చాటలేకపోయారు. హిందూపూర్ నియోజకవర్గంలో మొత్తం 38 స్థానాలకు గానూ. 30 స్థానాల్లో వైసీపీ మద్దతు దారులు గెలుపొందారు.
మరోవైపు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ మద్దతుదారు ఓడిపోయారు. అధికార వైసీపీ ప్రలోభాలకు పాల్పడిందని – అధికార దుర్వినియోగానికి పాల్పడిందని టీడీపీ ఆరోపణ చేస్తుండగా.. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమపథకాల వల్ల వైసీపీ మద్దతుదారులు గెలుపొందారని ఆ పార్టీ అంటున్నది. ఏది ఏమైనా చంద్రబాబు బావమరిది వియ్యంకుడు అయిన బాలకృష్ణకు సొంత నియోజకవర్గ ప్రజలు షాక్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
మరోవైపు అనంతపురం జిల్లా పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుపొందారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది