బాణసంచా కర్మాగారంలో భారీ పేలేడు ఘటనలో 11మంది మృతి

తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలేడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నాం విరుదునగర్ జిల్లాలోని అచంకులం గ్రామంలోని ఓ బాణసంచా కర్మాగారంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11మంది మృతిచెందగా,22మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.మృతి చెందిన 11మందిలో..9మంది శరీరాలు పూర్తిగా బూడిదైపోగా..మిగిలిన ఇద్దరు సత్తూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తుపట్టడం కష్టమైపోయిందిని పోలీసులు తెలిపారు. ఇక,తీవ్రగాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తలను మెరుగైన ట్రీట్మెంట్ కోసం మధురైలోని GRH హాస్పిటల్ కి తరలించారు.30మంది రెస్కూ సిబ్బందితో ఐదు ఫైరింజన్లు స్పాట్ కి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పేలుడులో 10రూములు పూర్తిగా నాశనమైపోయాయని ఫైర్ ఆఫీసర్లు తెలిపారు. పేలుడు సమయంలో ఈ కర్మాగారంలో దాదాపు 50మంది కూలీలు ఉన్నారని జిల్లా ఫైర్ ఆఫీసర్ గణేశన్ తెలిపారు. అయితే,పేలుగుకి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని పేర్కొన్నారు. అయితే చాలా మంది కాంట్రాక్టర్లు అక్రమంగా ఈ కర్మాగరాన్ని లీజ్ కి తీసుకొని నడిపిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ ఘటనపై ఈలఇరమ్పన్నై పోలీసులు కేసు నమోదు చేసి ప్రాధమిక దర్యాప్తు ప్రారంభించారు.