Andhra PradeshCrimeLatest NewsTelanganaYSR Kadapa
బస్సు, లారీ ఢీ 20 మంది ప్రయాణికులకు గాయాలు

ఓబులవారిపల్లె: మండల పరిధిలోని మంగంపేట వద్ద శనివారం ప్రధాన రోడ్డుపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు, కడప నుంచి తిరుపతికి వెళుతున్న లారీ వేగంగా వెళుతుండటంతో పరస్పరం రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఈ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బస్సు, లారీ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.