Andhra PradeshKurnoolSports
ఫుట్ బాల్ పోటీలుప్రారంభం
కర్నూలు జనవరి 16:- నగరంలోని స్థానిక బి క్యాంప్ హైస్కూల్ క్రీడా మైదానంలో పురుషుల ఫుట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.శనివారం జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు కలిసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఫుట్ బాల్ సెవెన్స విభాగంలో పోటీలు నిర్వహించడం పట్ల క్రీడాకారులు వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఇది ఉపకరిస్తుంది అన్నారు. ఫుట్బాల్ సంఘం ఆధ్వర్యంలో లీక్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. బీక్యాంప్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజికల్ డైరెక్టర్ పాల్ విజయ్ కుమార్ తీసుకున్న కృషి ప్రశంసనీయమని వారు వ్యాఖ్యానించారు. పోటీల్లో 14 జట్లు పోటీపడగా నాకౌట్ పద్ధతిన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజా,సుధాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.