ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్ర ఎన్నికల కమీషన్ పర్యవేక్షణలో…ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటురాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ నెంబర్: 0866-2466877
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్
కడప, ఫిబ్రవరి 11:- ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఎన్నికల ఫిర్యాదులను నేరుగా ఈ కాల్ సెంటర్ నెంబర్: 0866-2466877 కు ఫోన్ చేసి తెలియచేయవచ్చునన్నారు. ప్రజలు, అభ్యర్థులు, ఓటర్లు ఎవరైనా ఈ కాల్ సెంటర్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తే వాటిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు, ఎస్పీ లకు, ఎన్నికల అబ్జర్వర్ లకు , జిల్లా నోడల్ అధికారులకు తగు చర్య, పరిష్కార నిమిత్తం పంపబడుతాయన్నారు. ఇలా వచ్చిన ఫిర్యాదులను వెంటనే విచారించి ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ : 08562-244437, 08562-244070 నెంబర్లకు అదనంగా.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఈ ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.