ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ లు రక్తదానం చేయడం హర్షనీయం ఓ.ఎస్.డి అనీల్ కుమార్ రెడ్డి
పులివెందుల మన జనప్రగతి జనవరి 27:-ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ల దినోత్సవం సందర్బంగా… పులివెందుల ఎలక్ట్రీషియన్ ల అసోసియేషన్ అధ్యక్షులు సుభాన్ బాషా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక షాదీఖానా లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పాడా ఓ.ఎస్.డి అనీల్ కుమార్ రెడ్డి, రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. దివ్యశ్రీ లు ప్రారంభించారు… ఈ శిబిరం లో దాదాపు 35 మంది ఎలక్ట్రీషియన్ లు రక్తదానం చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధులు గా హాజరైన ఓ.ఎస్.డి అనీల్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి, కమీషనర్ నరసింహ రెడ్డి, సి.ఐ భాస్కర్ రెడ్డి, రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్.దివ్యశ్రీ లు మాట్లాడుతూ వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఐకమత్యంగా ఉంటూ ఇంకొకరికి ఆపద వచ్చినప్పుడు కలిసికట్టుగా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందించుకొంటూ. సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తూ అలాగే కోవిడ్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎలక్ట్రికల్ పరికరాన్ని తయారు చేసి దాని ద్వారా మార్కెట్ లకు వెళ్లే ప్రజలు వైరస్ బారిన పడకుండా వారి వంతుగా కృషి చేసిన ఎలక్ట్రీషియన్ ల అసోసియేషన్ బృందాన్ని వారు అభినందించారు… ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పులివెందుల లో లేబర్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, మీకు ప్రమాదభీమా, మీ కుటుంబాలకు జీవితభీమా కల్పిస్తామని, మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు… మీరందరు ఎలాంటి చెడు వ్యసనాలకు గురి కాకుండా మీ పిల్లలను బాగా చదివించి పిల్లలను సన్మార్గం లో పయనించేలా… ఉన్నత శిఖరాలకు చేరుకునేలా పిల్లల భవిష్యత్ కి పునాదులు వేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో పట్టణం లోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఓబులేసు, ప్రధాన కార్యదర్శి.రాము కోశాధికారి చాంద్ బాషా, ఎలక్ట్రీషియన్ లు రాజా, శివప్ప, భాస్కర్, రక్తనిధి సిబ్బంది హనుమకుమార్, సుమలత, మెర్సీ, సిద్దయ్య, తరుణ్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు,సభ్యులు హరికుమార్ తదితరులు పాల్గొన్నారు*