Uncategorized
ప్రేమించిందని దారుణం.. యువతిపై
పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబసభ్యులు
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే దారుణానికి ఒడికట్టారు. ఆ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘోర సంఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబసభ్యులు కొంతకాలంగా యువతికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. అయితే.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు.. పెళ్లి విషయంపై యువతిని బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో వారి మధ్య గోడవ పెరగడంతో.. సోదరుడు, తల్లి, తండ్రి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.