ప్రాణం పోసే సమయంలో, అత్యవసర సమయంలో, ప్రతి 2 సెకన్లకు రక్తం అవసరం.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి .
అనంతపురం డిసెంబర్ 21′
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి , ఎమ్మెల్సీ శమంతకమణి , రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి మరియు ఆరు మండల కన్వీనర్లు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ చేసి జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, అత్యవసర సమయంలో, ప్రతి 2 సెకండ్లకు రక్తం అవసరం అని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, అలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని మానవతా దృక్పథంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారని వారందరికీ ధన్యవాదములు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గంలో దాదాపుగా 410మంది రక్తదానం చేశారని చెప్పారు. రక్తదాన శిబిరంలో జయహో జగన్ మోహన్ రెడ్డి జోహార్ వైయస్ఆర్ అంటూ అభిమానులు మా గుండెల నిండా జగన్మోహన్ రెడ్డి మా బ్లడ్ లోనే జగన్మోహన్రెడ్డి మీకు కావలసినంత రక్తం తీసుకోండి అని ఆనందం వ్యక్తం చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రాజకీయమంటే విలువలు వ్యక్తిత్వాలు వదులుకొని చేసేది అనే అభిప్రాయం ఈ దేశంలో, మన రాష్ట్రంలో వినిపిస్తూ ఉంటుంది ఈ కుటిల రాజకీయాలను చూసి రాజకీయాల్లోకి రావాలని యువతరం వెనకడుగు వేసే పరిస్థితి! అయితే అదంతా గతం అనే చెప్పుకునే రోజులు వస్తున్నాయి, ఒకే ఒక నేత మొత్తం పరిస్థితిని మారుస్తున్నారు. ఒకే ఒక్క నేత రాజకీయాలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నారు. రాజకీయమంటే ఇచ్చిన మాట మీద నిలబడటం అని, రాజకీయమంటే గొప్ప విలువలతో కూడి ఉన్నది అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రశంసించారు. ఆయన పాలనలో మేమంతా భాగస్వాములు కావడం మేము చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించారు.