ప్రసంగం చేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు.గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎన్నికల
ప్రసంగం చేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన వడోదరలోని నిజాంపుర ఏరియాలో నిన్న చోటు చేసుకుంది. వడోదరతో పాటు మరో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఫిబ్రవరి 21న జరగబోయే ఎన్నికల నేపథ్యంలో సీఎం రూపానీ బీజేపీ కార్యకర్తలతో సమావేశమై ప్రసంగిస్తుండగా స్పృహ కోల్పోయాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎం పడిపోతుడంగా పట్టుకున్నారు. ఆ వేదికపై రూపానీకి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత అహ్మదాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి సీఎం ఆరోగ్యం సరిగా లేదని ఆయన సన్నిహితులు తెలిపారు .సమావేశాలు రద్దు చేసుకోవాలని కోరినప్పటికీ శనివారం జామ్ నగర్ లో, ఆదివారం వడోదర సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సీఎం రూపానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అయితే 24 గంటల పాటు రూపానీని అబ్జర్వేషన్లో ఉంచాలని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యులు పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు సీఎంకు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు