Andhra PradeshLatest NewsPoliticalSportsTelangana
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతెరాను ప్రారంభం

: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతెరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. లక్షా పది వేల సామర్థ్యంతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది. కాసేపట్లోనే ఈ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య డేనైట్ ప్రారంభం కాబోతోంది.