Andhra PradeshChittoorKurnoolLatest NewsNellorePoliticalPrakasamTelanganaYSR Kadapa
ప్రధాని వెక్కిరింతలకు సరైన సమాధానం: అఖిలేశ్ యాదవ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. భారీ విజయం సాధించడం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతాబెనర్జికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. దీదీ ఓ దీదీ అంటూ ప్రధాని నరేంద్రమోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో చేసిన వెక్కిరింతలకు ఈ ఫలితాలు గట్టి సమాధానమని అఖిలేశ్ పేర్కొన్నారు. ప్రధాని వెక్కిరింతలకు ప్రజలు మంచి జవాబిచ్చారన్నారు.