ప్రతి పేదవాడికీ సొంతింటి కల నెరవేరుస్తాం – ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపుదుర్తి ప్రకాష్ రెడ్డి .. – ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలని కోరిన లబ్ధిదారులు
అనంతపురం డిసెంబర్ 25:-
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాంఛనంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాప్తాడు కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తోపుదుర్తి_ప్రకాశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి_ప్రకాష్ రెడ్డి . మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పేదరికంతో సొంతింటి కలకు దూరం కాకూడదనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఇళ్ల పట్టాల పథకంలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో 14 వేల మందికి పైగా లబ్ఢి చేకూరుతుందని చెప్పారు. రాప్తాడు మండల కేంద్రంలో తొలి రోజు 410 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు.
జగన్‌గా సీఎం.. ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న ఉండాల్సిందే
కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రాప్తాడు ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఉంటేనే.. ప్రజలు బాగుంటారని అభిప్రాయపడ్డారు. పట్టా అందుకునేందుకు వేదిక పైకి వచ్చిన ఓ మహిళ మైక్ అందుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.
గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందలేదని.. కానీ జగనన్న సీఎం అయిన తర్వాత అమ్మ ఒడి.. విద్యాకానుక, ఇళ్ల పట్టాలు, బీసీ మహిళా రుణాలు అందినట్లు ఆమె తెలిపారు. ఫలితంగా సీఎంగా జగన్.. రాప్తాడు ఎమ్మెల్యేగా ప్రకాశ్‌రెడ్డి ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు