ప్రజలు అభివృద్ధికి అండగా నిలిచారు రెండింతల అభివృద్ధిని చేసి చూపిస్తాం
ప్రజలు అభివృద్ధికి అండగా నిలిచారు
రెండింతల అభివృద్ధిని చేసి చూపిస్తాం
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
అనంతపురం ,ఫిబ్రవరి18 :
అనంతపురం అర్బన్ పరిధిలోని పంచాయతీల ప్రజలు వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కి సంక్షేమ పాలనకు అండగా నిలిచి తమ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించారని ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా ఇంతకు రెండింతల అభివృద్ధిని అందజేస్తాం అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని 3 పంచాయతీలలో ఘన విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులు దూదేకుల ఆశాబీ, సుగాలి పద్మావతి, ఉదయ్ శంకర్ లు గురువారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులు తమ మద్దతుదారులను విజయానికి కీలకంగా వ్యవహరించాయి అని తెలిపారు. ప్రజాసంక్షేమ పాలనతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని,ప్రజల నమ్మకాన్ని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏవిధంగా అయితే నెరవేర్చాడో అదే బాటలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.వైసిపి ప్రభుత్వం పై నమ్మకంతో గత మొదటి రెండవ విడత లో మాదిరిగా మూడో విడత పంచాయతీ ఎన్నికల లోనూ 80 నుంచి 85 శాతం సర్పంచ్ అభ్యర్థులను అందించి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ప్రజలు అందించిన విజయాన్ని తాము ప్రజా విజయంగా భావించి వారికి సేవ చేస్తామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.