పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆడమ్ స్మిత్ హత్య జరిగిందని మాజీ ఎంపీ హర్షకుమార్
కర్నూలు: పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆడమ్ స్మిత్ హత్య జరిగిందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఇంత వరకు కలెక్టర్, ఎస్పీ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని తప్పుబట్టారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో హర్షకుమార్ ఓదార్పు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపట్ల సీఎం జగన్ స్పందించడం లేదని ఆయన తప్పుబట్టారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి.. భరోసా కల్పించేందుకు ఓదార్పు యాత్ర చేస్తున్నామని హర్షకుమార్ తెలిపారు.అగ్రవర్ణాలు, రాజకీయ నాయకులు కలసి ప్రేరేపిత కుట్రతో ఆడమ్ స్మిత్ హత్య జరిగిందని, భర్తను కోల్పోయిన మహేశ్వరికి ఎవరు రక్షణ కల్పిస్తారు? అని మాజీ జడ్జి రామకృష్ణ ప్రశ్నించారు.