పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
కడప ఫిబ్రవరి 13:-రెండవ దశ పంచాయతీ ఎన్నికలలోభాగంగా…. శనివారం కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండల జిల్లా పరిషత్ హై స్కూల్ లో వల్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఏర్పాటు చేసిన 7 నుంచి 11 వార్డుల పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి. హరి కిరణ్.ఆయా పోలింగ్ కేంద్రాలలో ఉన్న ఓటర్లు ఎంత శాతం పోలింగ్ అయింది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పి.ఓ, ఏపిఓ లను, ఏజెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్లో ఉన్న ఓటర్ల వద్దనున్న ఓటర్ స్లిప్ లను పరిశీలించిన కలెక్టర్ సి.హరికిరణ్.పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన కేంద్రాలను కూడా కలెక్టర్ తనిఖీ చేసి కౌంటింగ్ నిమిత్తం చేసిన ఏర్పాట్ల గురించి ఎంపీడీవో ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, కౌంటింగ్ త్వరగా ముగించేందుకు టేబుల్స్ సంఖ్యను పెంచుకోవాలని, తగిన విధంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచనలు జారీ చేశారు
అనంతరం వల్లూరు మండలం గోటూరు గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1నుండి 4 వార్డులకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు