పొట్టకూటి కోసం బ్రతికే వారికి కరోనా సమయపాలన….. మద్యం మత్తులో ఉన్న వారికి సమయ పాలన లేదు…… పోలీసులు వచ్చి క్యూ లైన్ కట్టడి చేస్తున్న వైనం
కడప మన జనప్రగతి మే 02:-పొట్టకూటి కోసం బ్రతికే వారికి కరోనా సమయపాలన మద్యం మత్తులో ఉన్న వారికి సమయ పాలన లేదు పోలీసులు వచ్చి క్యూ లైన్ కట్టడి చేస్తున్న వైనం పరిస్థితి మారింది వివరాల్లోకెళ్తే కరోనా మహమ్మారి నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు పాటించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులు ప్రాంతాలను బట్టి సమయపాలన ఏర్పాటు చేయడం జరిగినది దీంతో పొట్టకూటి కోసం బ్రతికే వారి కి ఈ సమయపాలన కొద్దిగా నష్టం కలిగించిందని చెప్పుకోవచ్చు అంతే కాకుండా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఇక మద్యం మాత్రం ఈ సమయపాలన ఇలాంటివేమీ లేకుండా స్వేచ్ఛగా వదిలేయడం చూస్తుంటే చోద్యంగా అనిపిస్తుంది కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారంగా చేసుకుంటూ జీవిస్తున్నాను చిన్న తరహా హోటళ్లు మరియు పాని పూరి గోబి సెంటర్లు సాయంత్రం వేళ వ్యాపారులు జరుగుతూ ఉంటాయి కానీ కరుణ మహమ్మారి కరుణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఈ వ్యాపారాలతో పాటు మద్యం షాపులు కూడా సమయపాలన పాటిస్తూ బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు మద్యం కోసం వద్ద వైన్ షాపు వద్ద మరియు బార్ల వద్ద అధిక జనం ఉండడంతో పాటు వారిని సర్దడానికి సాక్షాత్తు పోలీసులు వచ్చి వారికి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సాధారణ పరిస్థితుల్లో అయితే పోలీసులు చూస్తే మద్యం తాగేవారు కానీ అక్రమంగా మద్యం అమ్మేవాడు గాని భయపడతారు కానీ ఇప్పుడు వాటికి భిన్నంగా తాగేవాడికి పోలీసులు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కష్టకాలంలో అంత కష్టపడి మద్యం షాపు కోసం క్యూలైన్ల ఉంచుకుని మద్యం తాగిన పరిస్థితి ఏముంది ఇటువంటి పరిస్థితులలో మద్యం కాకపోతే చనిపోతే కనీసం మీ కుటుంబ సభ్యుల కోసం అయినా మీరు మారండి అంటూ మరి కొందరు మద్యం ప్రియులను హెచ్చరి స్తున్నారు అంతేకాకుండా కడప కమలాపురం పొద్దుటూరు రాయచోటి పులివెందుల ప్రాంతాల్లో విక్రయాల జోరు కొనసాగుతోంది ప్రభుత్వం నిబంధన ప్రకారం అన్ని షాపులకు ఆరుగంటలకే పూర్తిచేసి తర్వాత మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు షాపులు తెరవ కూడదని ఆదేశాలు ఇచ్చారు కానీ మద్యం ప్రియులు మాత్రం ఎవరు ఎట్లా పోతే మాకేంటి మాకు కిక్కు మాకు ఉంటే చాలు అనే ధోరణిలో మందుబాబులు ఉన్నారు ఇక ఈన సమయపాలన దిశానిర్థేశాలు ప్రభుత్వంలో లేక ఇలాంటి వారిని కొనసాగిస్తుందా చూడాలి……. *మద్యం కోసం బారులు బారులు తీరిన మద్యం ప్రియులు కాపలాగా పోలీసులు* పులివెందుల పట్టణం లో మద్యం ప్రియుల కోసం కాపలాగా ఒక ఎస్సై కేడర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది వారిని క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతి రోజు మద్యం షాప్ కాడ ఎలాంటి నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా మద్యం షాపు వద్ద ఉండటంతో వారిని క్యూలైన్లో ఉంచేందుకు పోలీసులు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పులివెందుల పట్టణంలో ఆరు గంటలకే అన్ని షాపులు బంద్ చేయడంతో జనసంచారం కూడా తగ్గిపోతుంది కానీ మద్యం దర్శనం మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది కోసం గుంపులు గుంపులుగా వారిని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరికొందరైతే పోలీసులను చూసి భయపడాల్సిన మద్యం ప్రియులు ఎంచక్కా పోలీసులు ఆధ్వర్యంలోని మందు కొనుగోలు చేసి దర్జాగా వెళ్తున్నాడు ఇది వారు తప్పు కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ విషయాలను సంబంధిత అధికారులు దృష్టిలో ఉంచుకొని ఇలా గుంపులు లేకుండా సమయపాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది