EducationWest Godavari
పేద విద్యార్థినికి ఆర్థిక సాయం
తణుకు డిసెంబర్ 22
తణుకు మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ చదువుతున్న పేద విద్యార్థినికి ఆర్థిక సాయం చేసినట్లు సంస్థ అధ్యక్షులు వంగూరి హనుమంతురావు తెలిపారు. మంగళవారం స్థానిక సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కఠారి శారదాదేవి భర్త విశ్వనాధరాజుల ఆర్థిక సౌజన్యంతో బికాం కంప్యూటర్ చదువుతున్న చింతకాయల హేమ ప్రియాంకకు కాలేజీ ఫీజు నిమిత్తం రూ.10 వేలు సంస్థ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గమని రాంబాబు, ఎంఎస్‌ఆర్ మూర్తి, రాధ ాపుష్పావతి, శారదాదేవి పాల్గొన్నారు.