పులివెందుల లో ఘనంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48 వ పుట్టిన రోజు వేడుకలు
పులివెందుల డిసెంబర్ 21:- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48 వ పుట్టిన రోజు సందర్భంగా పులివెందుల లో ని వైఎస్సార్ ఆడిటోరియంలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారుఈ శిబిరాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ శిబిరంలో వైఎస్ అవినాష్ రెడ్డి కెక్ ను కట్ చేసి స్వీట్ లు పంచారు. నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి తమ రక్తాన్ని దానం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పలు గ్రామాల్లో కెక్ లు కట్ చేసి స్వీట్ లు పంచారు…. పులివెందుల మున్సిపాలిటీ లో ని మునిసిపల్ సిబ్బంది కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టలు పండ్లు పంపిణీ చేశారు.అదేవిధంగా పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా కన్నులపండుగ వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు మరియు స్వచ్ఛంద సంస్థలు వైఎస్ అభిమాన సంఘ సభ్యులునియోజక వ్యాప్తంగా ప్రతి గ్రామములను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా పులివెందుల పట్టణం మరియు వేంపల్లి కడప తదితర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు