పులివెందుల లో అంబరాన్నింటిన సంక్రాంతి సంబరాలు
ప్రతి ఇంట సంతోషాల హరివిల్లులు విరబూయాలి వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ అభిషేక్ రెడ్డిపులివెందుల జనవరి 13:-సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పులివెందుల పట్టణం లో బుధవారం స్థానిక రాఘవేంద్ర హాల్ సమీపం లోని 14 వ సచివాలయం కౌన్సిలర్ అభ్యర్థి వై.ప్రసన్న లక్ష్మి దేవి ఆధ్వర్యం లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పోటాపోటీగా రంగులవల్లుల లో పాల్గొన్నారు, డాక్టర్. శరణ్య రెడ్డి న్యాయ నిర్ణేత గా వ్యవహరించిన ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి అమరావతి, ద్వితీయ , తృతీయ బహుమతులు వైయస్ మనోహర్ రెడ్డి మరియు అభిషేక్ రెడ్డి గారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి వరప్రసాద్, బూత్ కమిటీ మేనేజర్ హాల్ గంగాధర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ నరసింహా రెడ్డి ల చేతుల మీదుగా అందచేశారు.ఈ కార్యక్రమం లో శానిటరీ ఇన్ స్పెక్టర్ మురళీ, కౌన్సిలర్ అభ్యర్థులు కోడి రమణ, సి.కే. భార్గవి, శ్యామలా దేవి, పద్మనాభ రెడ్డి, వీరా రెడ్డి, కిషోర్, సిద్దయ్య, కొండయ్య, జగదీష్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, సభ్యులు రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు