పులివెందుల లయోలా కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలు ప్రశంసనీయం పులివెందుల గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చైర్మన్ వెంకటసుబ్బయ్య
పులివెందుల డిసెంబర్ 22 పులివెందులలోని లయోలా కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవలు ప్రశంసనీయమని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్ వెంకట సుబ్బయ్య ప్రశంసించారు.పులివెందుల లోని ప్రఖ్యాత శ్రీ రంగనాథ స్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ అమల్ ఆరోఖ్య రాజ్ నేతృత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో విద్యార్థులు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో పెరిగిపోయిన పిచ్చిమొక్కలు తొలగించారు. చెత్తాచెదారాన్ని శుభ్రం చేసి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ అమల్ రా జ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. తమ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి పాట పడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాథస్వామి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చైర్మన్ యార్వ వెంకటసుబ్బయ్య ,ఈవో వెంకటరమణ ,ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగనాయకులు రాయల్, జనొదయ సీఈవో కొప్పరపు శివకేశవ,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.