పులివెందుల మోడల్ సిటీ అభివృద్ధి ప్రణాళికల పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం.

పులివెందుల మోడల్ సిటీ అభివృద్ధి ప్రణాళికల పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం. పులివెందుల ఫిబ్రవరి12:- పులివెందుల మోడల్ సిటీ ఏర్పాటు చేసేందుకు గాను 690 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా ఆ మొత్తాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి ఎక్కడ ఎంత పెట్టాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ముఖ్యంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి అంశాలపై సంబంధిత అధికారులతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల మోడల్ సిటీ కి గాను 690 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని ఆ నిధులు ఎక్కడ అ పక్కదారి పట్టకుండా దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరియు మంచి సంకల్పంతో ముందుకు పోవాలని అప్పుడే అనుకున్న సమయానికి పులివెందుల మోడల్స్ సిటీ గా మార్చ అని పేర్కొన్నారు సంబంధిత అధికారులు తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసి అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన దిశానిర్థేశాలు ఇవ్వడం జరిగింది పట్టణంలో ఎక్కడైనా సరే త్రాగునీరు సిమెంట్ రోడ్లు ఇతర సమస్యలు లేకుండా చూసుకోవాలి సూచించడం జరిగింది సంబంధిత శాఖ అధికారులంతా సహృదయంతో తమకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేసి అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాడ ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ రెడ్డి పులివెందుల తాసిల్దార్ మాధవ కృష్ణా రెడ్డి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి డెవలప్మెంట్ ఇంటీరియల్ కార్పొరేషన్ అధికారులు ప్రసాదురాజు యశ్వంత్ శివ సంతోష్ మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు