పులివెందుల మునిసిపల్ మార్కెట్ కాంట్రాక్టర్లనుంచి రైతులను ,వ్యాపారులను కాపాడండి.

పులివెందుల. మే 01:- ఒపక్క రైతులను ,చిన్న వ్యాపారులను ఆదుకోవాలని ,అధికారయంత్రాంగం వారికి అండగా నిలబడాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగారు స్వయంగా చెబుతుంటే ,అయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మునిసిపాలిటీలో మార్కెట్ కాంట్రాక్టర్ల అరాచకానికి ,గేటు వసూళ్ళలో పాల్పడుతున్న దోపిడీకి అంతు లేకుండా పోతోంది .
మునిసిపాలిటీ వారు కాంట్రాక్టు అప్పగించేటపుడు ఫలానా దానికి ఇంత డబ్బే రాబట్టాలని ,రాబట్టినదానికి రసీదు ఇవ్వాలనే నిబంధన పెట్టి ఇవ్వడంజరుగుతోంది .
కానీ ఏ ఒక్క నిబంధనను ఇక్కడ పాటించడంలేదు .
ఇష్టానుసారంగా డబ్బులు వాసులు చేస్తున్నారు .
రైతులు తాము పండించిన పంటను మార్కెట్ కు తెస్తే వారు ఒక స్థలంలో వాటిని దించుకుంటే ఆ స్థలానికి 130 రూపాయలు రాబడుతున్నారు .అలాగే వారు తెచ్చిన బస్తాలకు ఒక్కోక్కింటికి 10 నుంచి 50 రూపాయల వరకు రాబడుతున్నారు .
తోపుడు బండ్ల వారితో ,గంపలమీద అమ్ముకునే వారితో ఇష్టానుసారంగా రాబడుతున్నారు .
మార్కెట్ లోకి ఆటో వచ్చినా ,ట్రాక్టర్ వచ్చిన డబ్బు కట్టాల్సిందే .
దేనికీ రసీదు ఇవ్వరు .
ఆదర్శ మునిసిపాలిటీ అంటే ఇంతేనేమో .!
అన్ని విషయాలపై సమీక్షలు చేస్తున్న అధికార యంత్రాంగం ,పాలకవర్గం ఎందుకు జరుగుతున్న దోపిడీపై సమీక్షించి చర్యలు చేపట్టడంలేదో అర్థంకావడం లేదు .
పక్కనున్న కడప ,ప్రొద్దుటూరులలో నిబంధనలమేరకు రాబడుతున్నారు ,రాబట్టినదానికి రసీదు ఇస్తున్నారు .
ఇదే నియోజకవర్గంలో వున్న వేంపల్లి ,simhadripuram గ్రామ పంచాయతీలలో కూడా కరెక్టుగానే రాబడుతున్నారు .
ఆఖరుకు గ్రామాలనుంచి ఎవరయినా పట్టణంలోని తమ వారికి ప్రేమగా ఒక కోడిని పట్టుకొని వచ్చినా దానికి కూడా గేటు రాబడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు .
వీరు చేస్తున్న దోపిడీ వలన అంతిమంగా బాధితులు అవుతున్నది ప్రజలే .
అన్ని ఊర్లలో కంటే ఏ వస్తువయినా పులివెందులలో ధర ఎక్కువ .కారణం దోపిడీ .
ఈ కరోనా కష్టకాలంలో ప్రజలు ,రైతులు ,వ్యాపారులు ఇబ్బంది పడుతుంటే కాంట్రాక్టర్స్ ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు సబబు ?
జరగుతున్న అక్రమ వసూళ్లపై అధికారయంత్రాంగం ,పాలకవర్గం చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను .
దీనిపై మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని అనవచ్చు ,ఆ పరిస్థితి ఇక్కడ వుందా ?
పరిస్థితి లో మార్పు రాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి జరుగుతున్న అరాచకాన్ని తీసుకుపోతాము ,
అవసరమయితే రాష్ట్ర హైకోర్టు లో రిట్ పిటిషన్ వేసి ఈ దోపిడీకి చరమగీతం పాడిస్తామని ,ఇప్పటికయినా పులివెందుల పరువు మంటగల్చకముందే చర్యలు తీసుకోవాలని మనవి. రామ్ గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు