పులివెందుల పట్టణంలో కర్ఫ్యూ అమలును పరిశీలించిన జిల్లా ఎస్పీ
పులివెందుల పట్టణంలో కర్ఫ్యూ ఆంక్షల అమలు పరిస్థితిని సోమవారం జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐపీఎస్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కోర్సు కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా అత్యవసర పరిస్థితులలో బయటకు వచ్చినప్పుడు రెండు మాస్కులు దారించాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అదే విధంగా సామాజిక దూరం పరిశుభ్రత తదితర అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు ను పట్టణంలోని కర్ఫ్యూ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు అర్హులైన జర్నలిస్టులకు కరోణ టీకా అందించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే జర్నలిస్టులకు టీకా అదే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు/ సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని పోలీసు అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో ఎస్ఐలు చిరంజీవి గోపీనాథ్ రెడ్డి హనుమంతు ట్రైనింగ్ ఎస్సై రామకృష్ణ ఏఎస్ఐ స్వామి పోలీసులు పాల్గొన్నారు