పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్.
పులివెందుల, డిసెంబరు 21: ఈనెల 24న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో… సోమవారం మధ్యాహ్నం పులివెందుల పట్టణం ముద్దనూరు రోడ్డు లోని పిబిసి కాలనీ ప్రాంతంలో టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని, ఏపీ కార్ల్, జె ఎన్ టి యు వెనకవైపు ఉన్న ఏపిఐఐసి భూములలో ఏర్పాటు చేయనున్న అపాచి లెదర్ ఇండస్ట్రీ శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను… ఎంపీ అవినాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు ఎం.గౌతమి, పి.ధర్మచంద్రారెడ్డి, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ విస్తృతంగా పర్యటించి ముఖ్యమంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. నూతన ఆర్టీసీ డిపో నిర్మించే ప్రదేశంలో… ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, వీఐపీ, వీవీఐపీ, అధికారులు, ప్రజల సీటింగ్ అరేంజ్మెంట్స్, వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణ, తదితరాలలో అధికారులతో చర్చించి పలు సూచనలు జారీ చేశారు. అలాగే ఎపికార్ల్, అపాచీ లెదర్ పరిశ్రమ ప్రాంతాలను సందర్శించి అక్కడ చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రదేశాలలో తగు విధమైన బందోబస్తు, భద్రత ఏర్పాట్లన్నీ పటిష్టవంతంగా పూర్తిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులతో కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ యధుభూషణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, తాసిల్దారు మాధవ కృష్ణారెడ్డి, వ్యవసాయ వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ జేడీలు మురళి కృష్ణ, సత్య ప్రకాష్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.